Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకుగా నన్ను గర్వపడేలా చేశాడు.. చిరంజీవి

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (13:41 IST)
మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగానికి గురయ్యాడు. కొడుకుగా తనను గర్వపడేలా చేశాడు అంటూ ఓ ట్వీట్ చేశారు. 
 
రామ్ చరణ్ తన 38వ పుట్టిన రోజును ఆదివారం జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజు చరణ్‌కు చాలా చాలా స్పెషల్ అనే చెప్పాలి. గత శుక్రవారం విడుదలైన "ఆర్ఆర్ఆర్" బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజునే ఏకంగా 223 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 
 
అలాగే, తన కుమారుడు చెర్రీకి కూడా చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ అరుదైన చిత్రాన్ని షేర్ చేశారు. "సోషల్ మీడియా ద్వారా చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం నాకు వింతగా అనిపిస్తుంది. కొడుకుగా నన్ను చరణ్ గర్వపడేలా చేశాడు. అదే నా గౌరవం. హ్యాపీ బర్త్ డే చరణ్" అంటూ ట్వీట్ చేశారు. 
 
ఈ సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చరణ్ చిన్నపుడు ఓ సినిమా షూటింగ్ సందర్భంగా బుగ్గమీద వేలితో తడుతూ ప్రేమ చూపిస్తున్న ఫోటో అది. అలాగే, "ఆచార్య" సినిమా షూటింగ్‌ సందర్బంగా కూడా చరణ్ బుగ్గపై వేలితో నిమిరే ఫోటోను దానికి ఆయన జతచేశారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, చరణ్‌లు కలిసి ఈ చిత్రాన్ని నటిస్తున్న విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అవకాశం వస్తే మళ్లీ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌లోకి వెళ్తా : సునీతా విలియమ్స్ (Video)

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments