Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిరంజీవి సతీమణి సురేఖ.. మీడియాతో గొడవ... ఎందుకు?

ఎప్పుడు సినిమా ఫంక్షన్లు జరిగినా తన భర్త చిరంజీవితో పాటు కలిసి వెళ్ళి సైలెంట్‌గా కూర్చుని తిరిగి వచ్చేస్తుంటారు ఆయన సతీమణి సురేఖ. ఎవరితోను పెద్దగా మాట్లాడరు. తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటి సురేఖకు కోపమొచ్చింది. అది కూడా ఎక్కడో కాదు. త

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (15:56 IST)
ఎప్పుడు సినిమా ఫంక్షన్లు జరిగినా తన భర్త చిరంజీవితో పాటు కలిసి వెళ్ళి సైలెంట్‌గా కూర్చుని తిరిగి వచ్చేస్తుంటారు ఆయన సతీమణి సురేఖ. ఎవరితోను పెద్దగా మాట్లాడరు. తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటి సురేఖకు కోపమొచ్చింది. అది కూడా ఎక్కడో కాదు. తిరుమలలోనే. తన కుమారుడి సినిమా రంగస్థలం విడుదలై భారీ విజయాన్ని కైవసం చేసుకోవడంతో శ్రీవారిని దర్శించుకున్నారు చిరు భార్య సురేఖ.
 
సురేఖతో పాటు ఆమె స్నేహితులు, బంధువులు కూడా ఉన్నారు. ఆలయం వెలుపల వస్తున్న సురేఖను మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తుండగా ఏయ్.. పక్కకు వెళ్ళండి.. ఏంటిది? ఎందుకు తీస్తున్నారు. అలా తీయకూడదు. తీయొద్దండి.. చెబుతున్నాగా.. వెళ్ళండి వెళ్లండి... అంటూ గట్టిగా అరిచారు. మేడం ఇది మా డ్యూటీ.. ప్రముఖులు వచ్చినప్పుడు చిత్రీకరించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటాము అని మీడియా ప్రతినిధులు చెప్పగా నాకు అదంతా అవసరం లేదు.
 
నన్ను తీయొద్దండి.. నన్ను టీవీల్లో చూపించొద్దండీ అంటూ గట్టిగా అరుస్తూ కారెక్కి వెళ్ళిపోయారు. సురేఖనే స్వయంగా చెప్పడంతో మీడియా ప్రతినిధులు కూడా సైలెంట్ అయిపోయారు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే సురేఖ ఇంత కోపాన్ని ప్రదర్శించడంతో మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments