భార్యకు మగబిడ్డ పుట్టలేదనీ భార్యపై కిరోసిన్ పోసి...
భార్యకు మగబిడ్డ పుట్టలేదన్న కోపంతో ఓ భర్త కసాయిలా మారాడు. కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
భార్యకు మగబిడ్డ పుట్టలేదన్న కోపంతో ఓ భర్త కసాయిలా మారాడు. కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బెంగళూరులోని కొప్పాగేటు ప్రాంతానికి చెందిన శశికుమార్, వీణలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. తన భార్యకు మగపిల్లాడు పుట్టలేదనే కోపంతో భర్త శశికుమార్ భార్య వీణను వేధిస్తూ వచ్చాడు. రెండో ఆడబిడ్డ పుట్టాక భార్యతో భర్త ప్రతీరోజూ గొడవ పడుతున్నాడు.
ఈ క్రమంలో రాత్రివేళ భార్య వీణపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవంగా దహనం చేశాడు. ఈ ఘటనపై వీణ తల్లిదండ్రుల ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను చంపిన భర్త శశికుమార్‌ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో అతను భార్యను హతమార్చినట్లు అంగీకరించాడు.