Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఇంట అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు..

వరుణ్
ఆదివారం, 14 జనవరి 2024 (13:21 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. తొలి రోజున భోగి పండుగ వేడుకలను ప్రతి ఒక్కరూ జరుపుకున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం చిరంజీవి - అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఫామస్‌కు చేరుకున్నారు. 
 
ఇంటి డెకరేషన్, విందు భోజనం, స్నాక్స్ - కాఫీ టైమ్, మెహందీ, యోగా టైమ్ అంటూ పలు వీడియోలను ఉపాసన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. తమ కుటుంబంలోకి ఇటీవల కోడలిగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి.. "కొత్త కోడలు ఇంటిల్లిపాదికి సున్నుండలు చేస్తోంది. ఆమె ఎంతో స్వీట్" అని వీడియో పోస్ట్ చేశారు. దీనిపై లావణ్య స్పందించారు. "థ్యాంక్యూ.. సూపర్ స్వీట్ పెద్ద కోడలు" అని రిప్లై ఇచ్చారు.
 
చిరంజీవి కుటుంబం ప్రతి ఏడాది సంక్రాంతిని వేడుకగా చేసుకుంటుంది. ఆ కుటుంబానికి చెందిన హీరోలందరూ షూట్స్ నుంచి బ్రేక్ తీసుకుని చిరు నివాసంలో గెట్ టు గెదర్ అవుతారు. ఆటలు, పాటలతో సరదాగా గడుపుతారు. వరుణ్ తేజ్ - లావణ్య వివాహం, క్లీంకార పుట్టిన తర్వాత తొలి సంక్రాంతి కావడంతో ఈసారి సెలబ్రేషన్స్ మరింత స్పెషల్గా మారాయి. పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య కూడా వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments