Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

ఠాగూర్
ఆదివారం, 12 మే 2024 (11:47 IST)
మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ జీవితమే అమ్మది అంటూ ఆయన ట్వీట్ చేస్తూ, తన భార్యతో కలిసి అమ్మతో దిగిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే, "అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అద్దమున్నద.." అంటూ అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ డాక్టర్‌ సినారె రాసిన ఈ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇవాళ మదర్స్‌ డే (Mothers day) సందర్భంగా అంతా ఈ పాటను గుర్తు చేసుకుంటూ అమ్మ పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మకు ఈ ఒక రోజు ఏంటి.. ప్రతి రోజు అమ్మదే.. ఈ జీవితమే అమ్మది.. అంటూ తల్లి, సతీమణి సురేఖతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
 
కాగా, చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తుండ‌గా.. ర‌మ్య ప‌సుపులేటి, సుర‌భి ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు. మేక‌ర్స్ ఇప్ప‌టికే షేర్ చేసిన విశ్వంభర కాన్సెప్ట్‌ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతోంది. ఇక టైటిల్‌ లుక్‌, కాన్సెప్ట్‌ వీడియో సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దమ్ముంటే నన్నుఅరెస్ట్ చేయాలి.. వైకాపా చీఫ్ జగన్ సవాల్

దుబాయ్ వీధుల్లో టర్కిష్ ఐస్ క్రీమ్‌ను రుచి చూసిన అనంత్ రాధిక (Video)

కేటీఆర్- సమంత కేసు.. సాక్షుల వాంగ్మూలం రికార్డ్.. తర్వాత ఎవరు?

పోలీసు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ.. త్వరలోనే అరెస్టా?

బెంగళూరులో 42 కేసులు నమోదు.. 64మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments