Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజనాదేవి పుట్టినరోజు వేడుకలు.. మెగా ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ (video)

సెల్వి
శుక్రవారం, 31 జనవరి 2025 (16:51 IST)
Anjana Devi
ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును హృదయపూర్వకంగా జరుపుకున్నారు. ఈ వేడుక చిరంజీవి నివాసంలో సన్నిహితుల మధ్య జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ తో పాటు నటుడు రామ్ చరణ్, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా పాల్గొన్నారు.
 
చిరంజీవి ఇంటికి చేరుకున్న అంజనా దేవికి ఘన స్వాగతం పలకడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆమెపై గులాబీ వర్షం కురిపించారు. ఆపై బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిరంజీవి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో తన తల్లి పట్ల తనకున్న ప్రేమ, గౌరవాన్ని ప్రదర్శిస్తుంది. 
 
69 ఏళ్ల నటుడు కూడా తన తల్లిని ప్రేమగా కౌగిలించుకుని, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే సాంగ్  పాడారు. అంజనా దేవి తన పుట్టినరోజు కేక్‌ను కట్ చేస్తూ... దానిని చిరంజీవి, ఆమె మనవడు రామ్ చరణ్‌లకు తినిపించింది. అలాగే ఉపాసనకు కేక్ ముక్క తినిపించింది.
 
ఈ వేడుక కుటుంబంలోని బలమైన బంధం, ప్రేమను హైలైట్ చేసింది. ఇది చిరంజీవికి తన తల్లి పట్ల ఉన్న లోతైన గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆనందకరమైన సందర్భంలోని ఫోటోలను అభిమానులు కూడా మెచ్చుకున్నారు.
 
కెరీర్ పరంగా చిరంజీవి తన తదుపరి చిత్రం విశ్వంభర కోసం సిద్ధమవుతున్నాడు. ఇది త్రిష,   మీనాక్షి చౌదరి కలిసి నటించిన ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments