Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్యాదగా మాట్లాడండి.. అలా చేస్తే పట్టించుకోను: పీకే ఫ్యాన్స్‌కు చిన్మయి వార్నింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ రెండో పెళ్లికి మద్దతుగా సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్‌పై విరుచుకుపడ్డారు. అంతేగాకుండా పీకే ఫ్యాన్స్‌ పట్

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (13:11 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ రెండో పెళ్లికి మద్దతుగా సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్‌పై విరుచుకుపడ్డారు. అంతేగాకుండా పీకే ఫ్యాన్స్‌ పట్ల రేణూ దేశాయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రేణుకు సపోర్ట్ చేసిన చిన్మయిపై కూడా పవన్ అభిమానులు ధ్వజమెత్తారు. 
 
ఓ మహిళ చెప్పిన దానిని ఇతరులు సరైన రీతిలో తీసుకోవాలని చిన్మయి కామెంట్ పెట్టింది. ఒక మహిళను సోషల్ మీడియా వేదికగా పురుషులు వేధించడం మరోసారి జరిగింది. మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ తంతు జరుగుతుంది. తనకు తెలిసి 2017 మార్చి నుంచి కొంతమంది వ్యక్తులు సరైన పాయింట్ లేకపోయినా.. ఎదుటి వ్యక్తిని కించపరుస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ద్వేషంతోనేనని చిన్మయి ఫైర్ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై పీకే ఫ్యాన్స్ స్పందించారు. 
 
చిన్మయిని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఆమెను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై చిన్మయి ప్రశాంతంగానే స్పందించింది. తన అభిప్రాయాలు నచ్చకపోతే.. గౌరవపూర్వకంగా స్పందించండి. అప్పుడు తాను ఏమైనా తప్పుగా మాట్లాడి వుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా.. అంతే కానీ అవమానకరంగా మాట్లాడితే తాను పట్టించుకోనంటూ చిన్మయి స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments