సింగ‌ర్ చిన్మయికి ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి..

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (10:14 IST)
సింగ‌ర్ చిన్మయి శ్రీపాద తల్లి అయ్యింది. అది కూడా చిన్మయి కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె ధ్రువీకరించింది. కవల పిల్ల‌ల‌కు సంబంధించిన చేతులు వారి చేతుల‌ను ఆమె, ఆమె భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ ప‌ట్టుకున్న ఫొటోల‌ను షేర్ చేసింది.
 
ఇద్ద‌రి పిల్ల‌ల్లో ఒక‌రికి ద్రిప్త అని.. మ‌రొక‌రికి శర్వాస్ అని పేరు పెట్టిన‌ట్లు ఆమె తెలియ‌జేసింది. చిన్మ‌యి పెట్టిన పేర్ల‌ను బ‌ట్టి చూస్తుంటే క‌వ‌ల‌ల్లో ఒక‌రు పాప‌.. మ‌రొక‌రు బాబు అని తెలుస్తోంది.
 
ఇక చిన్మ‌యి-రాహుల్ ర‌వీంద్రన్ త‌ల్లిదండ్రులు కావ‌టంపై నెటిజ‌న్స్‌, సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.  
 
ప్లే బ్యాక్ సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మ‌యికి త‌న‌దైన గుర్తింపు ఉంది. ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత‌ కు చిన్మ‌యినే డ‌బ్బింగ్ చెబుతుంటుంది. 2014లో హీరో, ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌ను ప్రేమించి పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు చిన్మ‌యి. 
Chinmayi
 
అలాగే మీటూ ఉద్యమంలో కూడా పాలు పంచుకున్నారు. ద‌క్షిణాదిన మీ టూ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంలో చిన్మ‌యి చొర‌వ చూపారు. సీనియ‌ర్ నటుడు రాధా ర‌వి.. ప్ర‌ముఖ పాటల ర‌చ‌యిత వైర‌ముత్తుల‌పై ఈమె ఆరోప‌ణ‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

Nobel Peace Prize ట్రంప్‌కి కాదు, మరియా కొరినా మచాడోని వరించిన పురస్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments