Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీ డేస్‌ల్లో మహిళలను తాకడానికి బస్సెక్కేవాడిని.. బిగ్ బాస్ కంటిస్టెంట్

Webdunia
సోమవారం, 29 జులై 2019 (18:42 IST)
కాలేజీ రోజుల్లో మహిళలను తాకడానికే బస్సులు ఎక్కేవాళ్లమని బిగ్ బాస్ తమిళ కంటిస్టెంట్, నటుడు శరవణన్ చేసిన కామెంట్స్‌పై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఫైర్ అయ్యారు. తమిళ బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటిస్టెంట్‌గా వున్న శరవణన్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈయన ఈ వారంతం వ్యాఖ్యాత కమల్ హాసన్‌తో చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. 
 
ఈ వారాంతంలో భాగంగా నటి మీరామిథున్ దర్శకుడు చేరన్‌పై చేసిన ఆరోపణలపై కమల్ హాసన్ మాట్లాడారు. టాస్క్ సందర్భంగా చేరన్ తనను ఇబ్బందికరంగా లాగి పక్కకు తోశాడని మీరామిథున్ ఆరోపించగా.. ఆ సందర్భంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాడు. చాలామంది ఉద్యోగాలకు వెళ్ళే అవసరంలో ఒకరినొకరు తోస్తూ వెళ్తుంటారు. 
 
అంతేకాదు.. కావాలనే మహిళలను తాకాలని బస్సుల్లో కొందరు అడ్డంగా తిరుగుతుంటారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలో శరవణన్ తన చేతిని పైకెత్తి.. తాను కూడా కాలేజీ డేస్‌లో మహిళలను తాకేందుకు బస్సు ఎక్కుతానని చెప్పాడు. దీంతో వివాదంలో చిక్కాడు. దీంతో షాకైన కమల్.. శరవణన్ నిజం ఒప్పుకున్నాడని కామెంట్ చేశాడు. 
 
ఈ చర్చకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన చిన్మయి.. శరవణన్ కామెంట్స్‌ను తప్పుబట్టింది. ఇలాంటి వ్యక్తిని ఓ రియాల్టీ షోలో వుంచడం అవసరమా అంటూ అడిగింది. మహిళలను తాకడానికి బస్సులెక్కేవారని శరవణన్ అంటుంటే.. మహిళలు కూడా క్లాప్స్ కొట్టడం ఏమిటని చిన్మయి ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments