Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లతో రజినీకాంత్ స్కెచ్ వేసిన అభిమాని...

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (16:46 IST)
అత‌నికి చేతులు లేవు, కాని కాళ్ళనే చేతుల్లా భావించి అన్ని ప‌నులు చేస్తుంటాడు. మంచి స్కెచ్‌లు కూడా వేయ‌గ‌ల‌డు. అత‌నెవ‌రో కాదు కేర‌ళ‌కి చెందిన ప్ర‌ణ‌వ్‌. ఇప్ప‌టికే స‌చిన్ టెండూల్క‌ర్‌, కేర‌ళ సీఎంతో పాటు ప‌లువురు స్కెచ్‌ల‌ని అద్భుతంగా వేసి శ‌భాష్ అనిపించుకున్నాడు. 
 
తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ని స్వ‌యంగా క‌లిసి ఆయ‌న‌కి త‌ను వేసిన స్కెచ్‌ని బ‌హుమ‌తిగా వ‌చ్చాడు. ఇది చూసిన ర‌జ‌నీకాంత్ చాలా సంతోషించి ప్ర‌ణవ్‌తో కాసేపు స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డిపారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌, ప్ర‌ణ‌వ్ క‌లిసి దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.
 
వీరాభిమానితో పాదాచాలనం... 
ఈ వివరాలను పరిశీలిస్తే, పుట్టినతేదీ ప్రకారం ఈ నెల 12వ తేదీన రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమాన సంఘాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
అయితే, ఈ సూపర్ స్టార్ మాత్రం తన పుట్టిన తిథి, నక్షత్రం ప్రకారం సోమవారం రోజు పుట్టిన రోజును జరుపుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళకు చెందిన వీరాభిమానిని ప్రత్యేకంగా పిలిపించుకుని కలిశారు.
 
ఈ వీరాభిమాని ప్రత్యేక ప్రతిభావంతుడు కూడా. ఇతనికి రజినీకాంత్‌తో కరచాలనం చేసేందుకు రెండు చేతులు లేవు. దీంతో రజనీ అతని పాదాలను తాకి పాదచాలనం చేశారు. అతనితో కాసేపు ముచ్చటించారు. 
 
ఈ పాదాచాలానికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments