Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై 'బట్ట బాబ్జీ'గాడు బాగా వాడేసుకున్నాడు... శ్రీరెడ్డి

నటి శ్రీరెడ్డి చెపుతున్న షాకింగ్ విషయాలతో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి విపరీతంగా చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె వివిధ చానళ్లకు, సైట్లకు దీనిపై ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇటీవలే క్యాస్టింగ్ కౌచ్ గురించి చెన్నైకు చెందిన ఓ వ్యక్తి ఎలా తనను ఇబ్బందిపె

Webdunia
మంగళవారం, 15 మే 2018 (17:05 IST)
నటి శ్రీరెడ్డి చెపుతున్న షాకింగ్ విషయాలతో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి విపరీతంగా చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె వివిధ చానళ్లకు, సైట్లకు దీనిపై ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇటీవలే క్యాస్టింగ్ కౌచ్ గురించి చెన్నైకు చెందిన ఓ వ్యక్తి ఎలా తనను ఇబ్బందిపెట్టాడో వివరించింది. ఆమె మాటల్లోనే... ఈ విషయాన్ని ఇప్పటివరకూ నేను ఎవరికీ చెప్పలేదు.
 
నా పర్సనల్ ఇష్యూ. టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్స్ కొట్టిన నిర్మాతకు ఓ స్నేహితుడున్నారు. అతని ద్వారా తమిళ ఇండస్ట్రీలో ట్రై చేయమన్నారు. ఐతే అక్కడికి వెళ్లాక తెల్సింది అతడి అసలు అవతారం. అతడికి కామము ఆ స్థాయిలో వుందని నాకు తెలీదు. నేను చెన్నైలో దిగ్గానే నాకు దుస్తులు కొనేందుకు షాపింగ్ కూడా అతనే చేశాడు.
 
ఆ రోజు సాయంత్రం ఖాళీగా వున్నాము. హోటలుకెళ్లి బాగా మందుకొట్టాడు. అతడిని చూసి ఎక్కువవుతున్నారు, ఇంటికెళ్దామని అన్నాను. ఎంతో పట్టుబట్టాక కానీ అతడు కదల్లేదు. హోటల్ గదికి వచ్చాక నన్ను పిలిచి తలుపు వేసుకోకు... ఇప్పుడే వస్తాను అన్నాడు... నాకు వెంటనే బల్బు వెలిగింది. అందుకే మెల్లిగా తలుపు గడియపెట్టాను. 
 
కొద్దిసేపు ఆగాక తలుపులు కొడుతూనే వున్నాడు. నేను మాత్రం తలుపులు తీయనేలేదు. తెల్లారాక నేను నన్ను ఇక్కడికి పంపిన ప్రొడ్యూసర్ భార్యకు ఫోన్ చేశాను. ఆమె బాగా తిట్టి వెంటనే ఆ బట్ట బాబ్జీగాడితో సంబంధాలు కట్ చేసుకోవాలని టాలీవుడ్ నిర్మాతతో చెప్పింది. ఐతే తల మీద ఒక్క వెంట్రుక కూడా లేని ఆ బట్ట బాబ్జీగాడు నా ఫ్రెండును బాగా వాడేసుకున్నాడు" అని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం