Webdunia - Bharat's app for daily news and videos

Install App

యథార్థ ఘటన ఆధారంగా చెంచల

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (12:50 IST)
chechala poster
శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోన్న `చెంచల` మూవీ టైటిల్ లోగోను విజయ దశమి సందర్భంగా విడుదల చేశారు. 'చెంచల' మూవీ కూర్గ్ ప్రాంతంలో పాము చుట్టూ జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెంచల పాత్రలో ఓ ప్రముఖ కథానాయిక కనిపించబోతోన్నారు.
 
ఈ చిత్రానికి జగదీష్ అచార్ దర్శకత్వం వహిస్తుండగా కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్, సుజిత్ శెట్టిలు సంగీతాన్ని అందిస్తున్నారు.  రామి రెడ్డి కెమెరామెన్‌గా, వెంకీ ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నారు. ఈ సినిమాకు  రచన భార్గవరామ్. డి,  వనమాలి పాటలు రాస్తుండగా.. చిన్ని ప్రకాష్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
ఈ సినిమా కథ చంచల పాత్రకు, ఓ పాముకు మధ్య సాగుతుంది. చెంచల కుటుంబం ఎలా హత్యకు గురైంది.. తన గతం ఏంటి? పాముతో తనకున్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించబోతోన్నట్టు నిర్మాత ఏఎన్ బాలాజీ తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారభిస్తాం అని నిర్మాత ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments