Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా చిత్రంలోని లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేసిన శ్రీ‌కాంత్‌

Srikanth and team
, శనివారం, 27 ఆగస్టు 2022 (17:50 IST)
Srikanth and team
తేజ్ కూర‌పాటి సోలో గా హీరోగా వస్తున్న చిత్రం “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇందులోంచి ఓ పాటను విడుదల చేసారు మేకర్స్. డా భవ్య దీప్తి రెడ్డి రచించిన 'ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియో ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. 
 
ఈ  సందర్బంగా  శ్రీ‌కాంత్ మాట్లాడుతూ, ఇందులో పాట చాలా ఆహ్లాద‌ర‌కంగా వుంద‌న్నారు. 
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ. హీరో శ్రీకాంత్ తో మేము ట్రావెల్ అవ్వాలనుకున్నాం. అయితే తను ఎంతో బిజీ ఉన్నా మా చిత్రంలోని  ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేసినందుకు వారికి మా ధన్యవాదములు.  దర్శకుడు వెంకట్ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. డా భవ్య దీప్తి రెడ్డి ఈ సినిమాకు చక్కటి ఐదు పాటలు రాయడం జరిగింది. సంగీత దర్శకుడు సందీప్ అందించిన మ్యూజిక్  ప్రేక్షకులకు ఇట్టే ఆకట్టుకుంటాయి  అన్నారు.
 
 చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ.. . రియ‌లిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము..ఈ సినిమాకు పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గార్ల తో  పాటు నటించిన వారు మరియు టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకుడు  వెంకట్ వందెల మాట్లాడుతూ...ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థ గా ఈ చిత్రంగా తెర‌కెక్కించే ఈ చిత్రంలోని 'ఏకాంత సమయం' అనే లిరికల్ వీడియోను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదములు. ఇలాంటి మంచి చిత్రం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు.ఈ చిత్రంలో యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వుంటాయి.  ప్రేమక‌థ తో పాటు చక్కటి వినొదాన్ని మిక్స్ చేసి తెర‌క్కించిన ఈ సినిమా  సెప్టెంబర్ 2  ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైగర్‌లో సీన్లు నేటివిటీకి తగ్గట్లు లేవు.. ట్రోల్స్ మొదలు..