Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుండె జారి గల్లంతయ్యిందే' డైరక్టర్‌పై స్లిప్పర్‌తో అత్త దాడి.. రెండోపెళ్లి చేసుకున్నాడని?

'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్ర దర్శకుడు కె.విజయ్‌కుమార్‌ కొండాపై దాడి జరిగింది. కొండా భార్య ప్రసూన తల్లి ఆయనపై దాడి చేసినట్టు సమాచారం. కొండాపై దాడి ఘటనే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (14:18 IST)
'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్ర దర్శకుడు కె.విజయ్‌కుమార్‌ కొండాపై దాడి జరిగింది. కొండా భార్య ప్రసూన తల్లి ఆయనపై దాడి చేసినట్టు సమాచారం. కొండాపై దాడి ఘటనే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. తెలుగు మ్యాట్రిమోనిలో రాంనగర్‌కు చెందిన ప్రసూన అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. వీరిద్దరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. 
 
అయితే వారం గడిచాకే అసలు విషయం తెలిసింది. అతని అప్పటికే పెళ్లయిందని.. ప్రసూన కంటే కొండా 17ఏళ్ల పెద్దవాడని తెలియరావడంతో  పెళ్లికి తల్లి ఒప్పుకోలేదు. అయినా ప్రసూన వివాహం కొండాతో జరిగిపోయింది. పదిరోజులుగా వధువు తరపు బంధువుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తుండడంతో భార్యతో కలిసి విజయ్‌కుమార్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇరువర్గాల వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే విజయ్‌కుమార్‌ అత్త స్వరూప, ఆమె సోదరి అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. మాయ మాటలు చెప్పి తమ కుమార్తెను వివాహం చేసుకున్నాడని, దీన్ని ఒప్పుకోబోమని.. ప్రసూనను పంపించాలని డిమాండ్‌ చేశారు. ప్రసూన మాత్రం కొండాతో ఉంటానని చెప్పేసింది. లిఖితపూర్వకంగానూ రాసిచ్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన స్వరూప.. చెప్పులు విసిరింది. దాడి చేసింది. కానీ గాడ్స్ సహకారంతో కొండా, ప్రసూన అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments