V. Samudra, Ramasathyannarayana, Suryakiran, G. Venkateswara Rao, Madilagan Muniyandi and others
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం చేజింగ్. కె. వీరకుమార్ కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్.. నిర్మాత రామసత్యన్నారాయణ సంయుక్తంగా ఈ టీజర్‌ను విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్, సుప్రభ హోటల్ సిఎమ్‌డి గుండు ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఇంత మంది హాజరవడం చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సినిమాకి ఎంతమంది సహకారం ఉందో. ఖచ్చితంగా చేజింగ్ మంచి సినిమా. నిర్మాతలు గ్రాండ్‌గా ఈ సినిమాని నిర్మించారనేది టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాని వెనుకుండి నడిపించింది పరిటాల రాంబాబుగారు. ఆయనకి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి విషయం తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను.. అని అన్నారు.
దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలకు, దర్శకత్వం వహించిన దర్శకుడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరిటాల రాంబాబు ఆధ్వర్యంలో ఈ చిత్రం బాగా వచ్చిందని విన్నాను. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్‌గారితో నేను కూడా పనిచేశాను. మంచి టాలెంటెడ్ పర్సన్. ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించి, టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను.. అన్నారు.
నిర్మాత రామసత్యన్నారాయణ మాట్లాడుతూ.. నిర్మాతలు కొత్తవారైనా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబుగారు మంచి అనుభవజ్ఞుడు. ఆయన ఆర్గనైజేషన్‌లో సినిమా రెడీ అవుతుంది కాబట్టి.. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇండస్ట్రీ నుండి కూడా ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఉంది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుంది.. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు.. అని తెలిపారు.
దర్శకుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాని నేను చూడటం జరిగింది. చాలా రిచ్‌గా తీశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. పరిటాల రాంబాబుగారి గురించి చెప్పాలంటే.. వాళ్ల అబ్బాయి అండర్ 19 క్రికెట్లో ఉన్నారు. అతని కంటే కూడా రాంబాబు చాలా స్పీడ్‌గా ఉంటారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.. అని అన్నారు.
చిత్ర నిర్మాతలు జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి మాట్లాడుతూ.. ఇది మా కాంబినేషన్లో మొదటి సినిమా అయినా.. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదు. మరిన్ని సినిమాలు తెలుగు, తమిళ్లో తీయాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుతున్నాము.. అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు కె. వీరకుమార్, నటులు రంగరాజు, అప్సర్ ఆజాద్.. దర్శకుడు నగేష్ నారదాసి వంటివారు మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి