Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవన్నీ పుకార్లే.. ఏ ఒక్క వార్తలో రవ్వంత నిజం లేదు : రాఘవ లారెన్స్

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (11:58 IST)
గత కొన్ని రోజులుగా "చంద్రముఖి-2" (సీక్వెల్)పై అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు కమ్ హీరో రాఘవ లారెన్స్ నటిస్తుండగా, పి.వాసు దర్శకత్వం వహించనున్నారు. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా జ్యోతిక, సిమ్రాన్, కియారా అద్వానీ అంటూ పలువురు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై రాఘవ లారెన్స్ స్పందించాడు. 
 
'చంద్రముఖి సీక్వెల్ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సంబంధించి అనేక రూమర్లు వస్తున్నాయి. జ్యోతిక, సిమ్రాన్, కియరాల్లో ఒకరు చేస్తారని ప్రచారం జరుగుతోంది, అయితే ఇదంతా ఫేక్ న్యూస్' అని ఆయన కొట్టిపారేశారు. పైగా, ప్రస్తుతం చంద్రముఖి-2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, కరోనా పరిస్థితులు సద్దుమణిగాక ప్రధానపాత్రలో నటించే కథానాయిక ఎవరన్నది ఖరారు చేసి వెల్లడిస్తామని తెలిపారు. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని లారెన్స్ సోషల్ మీడియాలో తెలిపాడు.
 
కాగా, గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రధారులుగా పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి చిత్రం వచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇపుడు ఈ చిత్రం సీక్వెల్ చేసేందుకు దర్శకుడు పి.వాసు సిద్ధమయ్యాడు. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments