Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సారీ.. నిరాశకు గురిచేస్తున్నా.. 'చంద్రముఖి-2'లో నటించడం లేదు: సిమ్రాన్

Advertiesment
సారీ.. నిరాశకు గురిచేస్తున్నా.. 'చంద్రముఖి-2'లో నటించడం లేదు: సిమ్రాన్
, బుధవారం, 3 జూన్ 2020 (15:33 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి సిమ్రాన్. తెలుగులో అగ్ర హీరోలందరితోనూ నటించింది. ఆ తర్వాత ఓ ఇంటికి కోడలైన తర్వాత వెండితెరకు దూరమైంది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అది క్లిక్ కాలేదు. ఈ నేపథ్యంలో 'చంద్రముఖి' సీక్వెల్ చిత్రంలో సిమ్రాన్ నటించనుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
దీనిపై సిమ్రాన్ క్లారిటీ ఇచ్చింది. తాను "చంద్రముఖి-2" చిత్రంలో నటించడం లేదని చెప్పింది. అభిమానులను నిరాశకు లోనుచేస్తున్నందుకు నన్ను క్షమించాలి. నేను 'చంద్రముఖి-2'లో నటించడం లేదు. ఆ సినిమాలో నటించమని నన్ను ఇప్పటివరకు ఎవరూ అడగలేదు. దయచేసి అవాస్తవ వార్తలను ప్రచారం చేయకండ'ని సిమ్రాన్ విజ్ఞప్తి చేసింది. 
 
కాగా, సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'చంద్రముఖి'. దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్ తెరకెక్కబోతోంది. పి.వాసు దర్శకత్వంలోనే రూపొందనున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ నటించబోతున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరో ఛాన్స్ మిస్ చేసుకోనంటున్న హీరోయిన్... ఎవరు?