Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతన్య రావు, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆహాలో ఆదరణ

డీవీ
ఆదివారం, 13 అక్టోబరు 2024 (11:53 IST)
Chaitanya Rao and Hebba Patel
మంచి కంటెంట్‌తో వచ్చే చిత్రాలు అయితే ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు అయితే నెలల తరబడి ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఈక్రమంలోనే  చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. చైతన్య రావు చేస్తున్న చిత్రాలు ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఆయన ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లో, ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
 
అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ 70 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు, నటన, కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. 
 
ఇక ఈ చిత్రం ఇప్పుడు ఆహాలోకి వచ్చి దుమ్ములేపుతోంది. మొదట్లో అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం గత కొన్ని రోజులుగా ఆహా వినియోగ దారుల్ని సైతం ఎంటర్టైన్ చేస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చింది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా ఈ చిత్రాన్ని తీశారు. అందుకే యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments