Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిపిల్లపై నటి భానుప్రియ సోదరుడి లైంగికదాడి...

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (17:30 IST)
టాలీవుడ్ సీనియర్ నటి భానుప్రియ చిక్కుల్లో పడ్డారు. ఈమె ఇంట్లో పని చేస్తున్న పనిపిల్ల (బాలిక)పై భానుప్రియ సోదరుడు లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధిత బాలిక తల్లి సామర్లకోట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సామర్లకోట మండలం, పండ్రవాడకు చెందిన సంధ్య అనే అమ్మాయి యేడాదిన్నర కిందట చెన్నైలోని సినీ నటి భానుప్రియ ఇంట్లో పని చేయడానికి వెళ్లింది. కొద్దిరోజుల తర్వాత భానుప్రియ సోదరుడు ఆ బాలికను లైంగికంగా వేధించడం, చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని తన తల్లి ప్రభావతికి బాలిక ఫోన్ చేసి చెప్పింది. దీంతో కుమార్తెను చూసేందుకు హుటాహుటిన చెన్నైకు వెళ్లిన ప్రభావతిను భానుప్రియ కుటుంబ సభ్యులు బెదిరించినట్టు సమాచారం. బాలికను పంపించబోమని, బలవంతం చేస్తే దొంగతనం చేసినట్టుగా కేసుపెడతామంటూ బెదిరించినట్టు ప్రభావతి ఆరోపిస్తోంది. 
 
ఇదే విషయాన్ని ప్రభావతి సామర్లకోట పోలీసులకు ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయితే, ఈ వ్యవహారంపై చెన్నైలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని ఆమెకు పోలీసులు చెప్పారు. వాస్తవానికి తాను చెన్నైలో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించానని, అక్కడ భానుప్రియ కుటుంబం పలుకబడితో తానేమి చేయలేకపోయానని వాపోయింది. దీంతో సామర్లకోట పోలీసులు చేసేదేం లేక చైల్డ్‌లైన్ ద్వారా చెన్నైలోని ఛైల్డ్‌లైన్‌కు బదిలీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం