Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వ‌ర్మ లాంఛనంగా ప్రారంభించిన కార్టూన్స్ 90's కిడ్స్ బే ఈడా

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (18:24 IST)
Ram Gopal Varma, Cartoons 90's script
నైన్‌టీస్‌లో పుట్టిన వారి అనుభవాలను తెలుపుతూ చేసిన అడ్వెంచర్స్ చిత్రమే "కార్టూన్స్ 90's కిడ్స్ బే ఈడా". దీపాల ఆర్ట్స్ పతాకంపై త్రిగున్, పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష,నటీనటులు గా సాయి తేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి  ప్రముఖ దర్శకుడు ఆర్.జీ.వి, నటులు సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు..పూజా కార్యక్రమాలు అనంతరం నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు.నటుడు ఆకాష్ పూరి కెమెరా స్విచ్ ఆన్ చేయ్యగా.. ప్రముఖ దర్శకుడు ఆర్.జీ.వి గారు గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంతరం చిత్ర దర్శకుడు సాయి తేజ సప్పన్న మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానిని. వారి సినిమాలు చూస్తూ పెరిగాను.ఆయన ఇన్స్పిరేషన్ తో డిప్లమో నుంచి డైరెక్టర్ కావాలనే బలమైన కోరిక నాలో కలిగింది. "డీ" ప్రోగ్రాం లో డాన్సర్ గా, కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాను.ఆ తరువాత ఒక  మంచి కథ రాసుకొని నిర్మాత శ్రీకాంత్ గారికి చెప్పడం జరిగింది. 
ఫ్రెండ్షిప్ జోనర్ లో నేను రాసుకున్న ఈ కథ నిర్మాత శ్రీకాంత్ గారికి నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ను ఇగ్నోర్ చేస్తే మిగిలిన ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.ఆ తరువాత ఇగ్నోర్ చేసిన ఫ్రెండ్ ఎలా ఉంటున్నాడు అనే దానికపై ఈ స్టోరీ ని రాయడం జరిగింది.ఫుల్ ఔట్ ఔట్ కామెడీ డ్రామా గా తెరకెక్కుతుంది. 90's లో పుట్టిన వారి మెమొరబుల్స్ అన్ని ఈ సినిమాల్లో కనిపిస్తాయి.వారు ఈ సినిమా చూస్తున్నప్పుడు వారు చేసిన పనులను గుర్తుకు తెచ్చుకొని హ్యాపీగా ఫీలవుతారు. ఇందులో హీరోగా త్రిగున్, పాయల్ రాధాకృష్ణ హీరో, హీరోయిన్లు గా నటిస్తున్నారు.వారికి ఈ కథ చెప్పినపుడు చాలా ఎగ్సైట్ అయ్యారు.వీరితోపాటు దీపక్ సరోజ్, హర్ష లతో పాటు నేను కూడా ఇందులో పప్పు అనే మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. మేం చేస్తున్న ఈ చిత్రాన్ని మీ రందరూ బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
నిర్మాత  శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ,  నేను నిర్మిస్తున్న నాలుగవ చిత్రమిది.ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. తమ్ముడు సాయి తేజ సప్పన్న మంచి కథ రాసుకొన్నాడు.ఈ కథ నాకే కాకుండా అందరికీ నచ్చింది మంచి టీం తో ఫుల్ ఔట్ ఔట్ కామెడీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.. 
 
Trigun, Payal Radhakrishna
చిత్ర హీరో త్రిగున్ మాట్లాడుతూ..కొండా బయోపిక్ లో చేస్తున్న నేను ఆర్.జి.వి గారు మంచి కథలను సెలెక్ట్ చేసుకొని చెయ్యమని సూచనలు ఇచ్చారు.ఈ సినిమా గురించి తనతో చెప్పడంతో "కార్టూన్" అనే సినిమా ప్రతి ఒక్కరికీ రీచ్ అవుతుందని అభినందించారు. శ్రీకాంత్ నేను ఇంతకుముందు సినిమా చేద్దాం అనుకున్నాము. కానీ కుదరలేదు. ఇప్పుడు మంచి స్క్రిప్ట్ కుదిరింది. యాక్షన్ సినిమా చేద్దాం అనుకున్న టైం లో దర్శకుడు నాకీ కథ చెప్పాడు. ఈ కథ వినగానే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకు వచ్చాయి.ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. పాయల్ రాధాకృష్ణ చేసిన తరగతి గది వెబ్ సిరీస్ తో తనకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఇలా మంచి ఆర్టిస్టులతో కలసి చేస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అయ్యేలా ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సంవత్సరం మా అందరికీ ఈ చిత్రం తో మంచి పేరు రావాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 
 
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. దర్శకుడు నాకీ కథను చెప్పినపుడు చాలా ఎగ్సైట్ అయ్యాను. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటుడు వైవా హర్ష మాట్లాడుతూ..ఇది ఫుల్ ఔట్ ఔట్ కామెడీ స్క్రిప్ట్ సినిమా చూసిన వారంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారనే నమ్మకం ఉందని అన్నారు.
దీపక్ సరోజ్ మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్టుగా 45 సినిమాలు చేశాను.ఈ సినిమాలో మంచి రోల్ చేస్తున్నాను.దీపాల ఆర్ట్స్ లో నాకీ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు 
 
నటీనటులు-  త్రిగున్,,పాయల్ రాధాకృష్ణ,దీపక్ సరోజ్,వైవా హర్ష, సాయి తేజ సంపన్న తదితరులు 
 
సాంకేతిక నిపుణులు-  ప్రొడ్యూసర్ : శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ, డైరెక్టర్ : సాయి తేజ సప్పన్న డి. ఓ పి : చరణ్ మాధవనేని,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గుంపిన కళ్యాణ్ చక్రవర్తి 
కో రైటర్ అండ్ ఏడి : నరేంద్ర తేజ.ఆర్ , కో డైలాగ్ : విశ్వనాథ్ కందుకూరి,  ఎడిటర్ :: కె.బాలకృష్ణారెడ్డి (బాలు)  ఆర్ట్ డైరెక్టర్ : పిఎస్ వర్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

అమెరికా నుంచి భారతీయులను ప్రత్యేక విమానాలలో ఎందుకు తిప్పి పంపుతున్నారు, ట్రంప్ వచ్చాక ఏం జరగనుంది?

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments