Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

పబ్‌లో నటితో వర్మ రచ్చ.. ఫోటోకు క్యాప్షన్ పెడితే రూ.లక్ష

Advertiesment
Ram Gopal Varma
, శుక్రవారం, 28 జనవరి 2022 (14:39 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. ఆయన తాజాగా ఓ పబ్‌లో అమ్మాయిలతో రచ్చ రచ్చ చేశారు. పీకల వరకు మద్యం సేవించి, సిగరెట్ కాలుస్తూ ఓ అమ్మాయిని గట్టిగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెడుతున్న ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం అనుభవించు రాజా అనుభవించూ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే, రాంగోపాల్ వర్మ మాత్రం ఈ ఫోటోకు క్యాప్షన్ పెట్టిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తానంటూ ప్రకటించినట్టుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 
 
ఇంతకీ వర్మ ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరో కాదు.. నటి ఇనయా సుల్తానా. ఆమె కూడా సిగరెట్ కాల్చుతున్నారు. ఇక వర్మ సంగతి చెప్పనక్కర్లేదు. పబ్లిక్‌గా సిగరెట్ తాగుతూ నటి ఇనయా బుగ్గపై ముద్దుల వర్షం కురిపించారు. మందు బాటిల్ పట్టుకుని తెగ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను వర్మ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ‌విష్ణు భ‌ళా తంద‌నాన... టీజ‌ర్‌ విడుద‌ల (video)