Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ‌విష్ణు భ‌ళా తంద‌నాన... టీజ‌ర్‌ విడుద‌ల (video)

Advertiesment
శ్రీ‌విష్ణు భ‌ళా తంద‌నాన... టీజ‌ర్‌ విడుద‌ల (video)
, శుక్రవారం, 28 జనవరి 2022 (14:16 IST)
Bhala
శ్రీ‌విష్ణు రాజ రాజ చోర హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవ‌ల వ‌చ్చిన అర్జున ఫ‌ల్గుణ హిట్ కాక‌పోయినా.. మంచి ప్ర‌య‌త్నం అనిపించుకుంది. తాజాగా ఆయ‌న నుంచి మ‌రొక సినిమా రావ‌డానికి రెడి అవుతోంది. ఆ సినిమా భ‌ళా తంద‌నాన వారాహి బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. 
 
ర‌జినీ కొర్ర‌పాటి నిర్మించిన ఈ సినిమాకు చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.  వారాహి చ‌ల‌న చిత్రం ప‌తాకంపై ర‌జ‌నీ కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ‌నివాస్‌రెడ్డి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, స‌త్య పోసారి కృష్న‌ముర‌ళి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల అవ్వ‌నుంది. కేజీఎఫ్ ఫేమ్ రామ‌చంద్ర‌రాజు ఈ సినిమాలో విల‌న్‌గా న‌టించారు. 
 
చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా టీజ‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకునేవిధంగా ఉంది. మ‌ణిశ‌ర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. టీజ‌ర్‌లో శ్రీ‌విష్ణును మునుపెన్న‌డూ చూడ‌ని అవ‌తార్‌ను చూపించారు. ఇందులో శ్రీ‌విష్ణు క్రైమ్ రిపోర్ట‌ర్‌గా న‌టించాడు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు నెటిజ‌న్లు చీవాట్లు