Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాజిటివ్‌, గుండె ఆప‌రేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ అరుణ్ పాండ్య‌న్‌

Webdunia
శనివారం, 8 మే 2021 (18:38 IST)
keerti, arun pandiyan
ప్రముఖ నటుడు,నిర్మాత అరుణ్ పాండ్యన్ చావుకు ద‌గ్గ‌ర‌గా వెళ్ళి వ‌చ్చాడు. గ‌త నెల‌లో కోవిడ్ బారికి గుర‌య్యాడు. అదో పీడ‌క‌ల‌గా ఆమె కుమార్తె న‌టి కీర్తి పాండ్య‌న్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ‌త‌నెలలో షెడ‌న్‌గా ఓరోజు త‌న తండ్రికి చెస్ట్ పెయిన్ రావ‌డంతో ఆసుప‌త్రికి వెళ్ళాం. అక్క‌డ ముందుగా క‌రోనా టెస్ట్ చేశారు. పాజిటివ్ అని తేల్చారు. అనంత‌రం 15రోజుల‌పాటు క్వారంటైన్‌లో వుంటూ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అయితే అప్ప‌టికే ఫ‌స్ట్ డోస్ వేక్సిన్ వేసుకోవ‌డం వ‌ల్ల తీవ్ర‌త త‌గ్గింది. అస‌లు ఫ‌స్ట్ డోస్ వేసుకున్నాక చాలామందికి ఛాతినొప్పి రావ‌డం స‌హ‌జం అని డాక్ట‌ర్లు చెప్పారు. దాంతో భ‌యం నుంచి తేరుకున్నాం. 
 
ప్ర‌స్తుతం నెగెటివ్ రావ‌డంతో ఊపిరి పీల్చుకున్నాం. నాన్న‌కు షుగ‌ర్ వుండ‌డం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని అనుకున్నాం. నెగెటివ్ వ‌చ్చాక మ‌ర‌లా గుండె ప‌రీక్ష‌లు చేసిన‌ప్పుడు  రెండు వాల్వ్స్ బ్లాక్స్ ఉన్నాయనే విషయం తెలిసింది. క‌రోనా టైంలోనూ మ‌నోధైర్యంతో యాంజోప్లాస్ట్ కు సిద్ధపడ్డారని, ఆపరేషన్ విజయవంతంగా జరిగి ఇప్పుడు కోలుకుంటూ ఉన్నారని కీర్తి చెప్పింది. త‌న తండ్రి గురించి తెలియ‌గానే అభిమానులు ప్రార్థ‌న‌లు చేశార‌ని వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్య విషయమై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మలయాళ చిత్రం 'హెలెన్'ను ఇటీవల అరుణ్ పాండ్యన్ తమిళంలో రీమేక్ చేశారు. అందులో అరుణ్ పాండ్యన్, కీర్తి తండ్రీ కూతుళ్ళుగా నటించారు. దాన్ని ప్ర‌స్తుతం ఓటీటీలో విడుద‌ల చేసేప్లాన్‌లో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments