అల్లు అరవింద్‌కు కరోనా పాజిటివ్ అని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పవన్‌కళ్యాణ్ సినిమా ప్రీరిలీజ్‌కు కూడా ఎవ్వరూ రాలేదని అభిమానులు అడుగుతున్నారట. ఏదిఏమైనా కరోనా పాజిటివ్ అల్లు అరవింద్‌కు వచ్చింది. రెండు డోస్‌లు వేసుకున్నాక ఆయనకు తీవ్రంగా వుందని సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలకు అల్లు అరవింద్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.
నాకు కరోనా వచ్చిన మాట వాస్తవమే. రకరకాలుగా రాస్తున్నారని నేను స్పందించాల్సివచ్చింది. నాకు రెండు వాక్సిల్ డోస్ ల తర్వాత కరోనా వచ్చిందని రాస్తున్నారు. నేను ఒక వాక్సిన్ డోస్ తీసుకుని ముగ్గుర స్నేహితులం ఊరు వెళ్ళాం. వెళ్ళాక నాకు లైట్‌గా ఫీవర్ వచ్చింది.
ఒకాయన ఆసుపత్రిలో చేరాడు. ఆయన వాక్సిన్ వేయించుకోలేదు. వాక్సిన్ వేసుకున్నాక లైట్‌గా జ్వరం వస్తుంది. తప్పని సరిగా వాక్సిన్ వేసుకుంటే ప్రాణహాని నుంచి కాపాడబడతాం. అందుకే అందరూ వేయించుకోవాలి.నేనే ఉదాహరణ. కరోనా అందరికీ వచ్చి వెళ్ళిపోద్ది. కనుక వాక్సిన్ వేయించుకోండని.. వెల్లడించారు.