Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్మార్ట్ శంక‌ర్ సెన్సేషన్... పూర్ పూరీకి ఈసారైనా క‌లిసి వ‌చ్చేనా..?

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (16:22 IST)
ఇస్మార్ట్ శంక‌ర్.. ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి వార్త‌ల్లో ఉంటున్నాడు. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ తాజా చిత్రం  ఇస్మార్ట్ శంకర్‌లో ఎన‌ర్జిటిక్ హీరో రామ్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, నభా నటేశ్ న‌టించారు. ట్రైల‌ర్‌లో పూరి మార్కు డైలాగులు, హీరో క్యారెక్ట‌రైజేష‌న్, బూతు డైలాగులు క‌న‌ప‌డ‌టంతో మాస్ ఆడియ‌న్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని పిచ్చెక్కిస్తుంది. రామ్ అంటే ఎన‌ర్జి.. పూరి అంటే మాస్.. ఇక వీరిద్ద‌రు క‌లిస్తే.. ఇక డ‌బుల్ మాస్ అనేలా ఈ ట్రైల‌ర్ ఉంది.
 
ఈమ‌ధ్య కాలంలో ఈ రేంజ్ ఊర మాస్ సినిమా వ‌చ్చి చాలా రోజులు అయ్యింది. దీంతో ఈ ట్రైల‌ర్ సినిమాపై ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింద‌ని చెప్ప‌చ్చు. ఇలా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారో లేదో.. అలా యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 5 మిలియ‌న్ వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నెంబ‌ర్ 1గా నిలిచింది. 
 
పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా ఫాస్ట్‌గా జ‌రుపుకుంటోంది. ఈ నెల 18న ఇస్మార్ట్ శంక‌ర్ థియేట‌ర్‌లోకి రానున్నాడు. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే... పూరి ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న‌ హిట్ ఇచ్చేలా క‌నిపిస్తుంది. మ‌రి.. ఇస్మార్ట్ శంక‌ర్ ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments