Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అజ్ఞాతవాసి' అదిరిపోయిందట... 'బాహుబలి'ని బ్రేక్ చేస్తుందేమో? రెండురోజులు కుమ్ముడే...

రేపు విడుదల కానున్న అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ అభిమానులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్రెంచ్ సినిమా లార్గో ఫించ్‌కు ఇండియాలో రీమేక్ హక్కులు ఉన్న టీ సిరీస్‌కు సినిమా ప్రివ్

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (15:55 IST)
రేపు విడుదల కానున్న అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ అభిమానులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్రెంచ్ సినిమా లార్గో ఫించ్‌కు ఇండియాలో రీమేక్ హక్కులు ఉన్న టీ సిరీస్‌కు సినిమా ప్రివ్యూ చూపించడంతో కాపీ అంటూ వచ్చిన వార్తలు కూడా నిజం కాదని తేలిపోయింది. అయితే ప్రివ్యూ చూసిన టీ సిరీస్ ప్రతినిధులు సినిమా అద్భుతంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఓ విధంగా ఈ వివాదం కూడా సినిమా ప్రచారానికి బాగా ఉపయోగపడింది.
 
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు సినిమాకు అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, 3000కు పైగా థియేటర్స్‌లో విడుదల చేసి, మొదటిరోజే భారీ రికార్డులు నెలకొల్పడానికి ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో కనీసం రెండు రోజులపాటు 90 నుండి 95 శాతం థియేటర్లలో అజ్ఞాతవాసి సినిమానే ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి పాజిటివ్ టాక్ తోడైతే బాహుబలి2 కలెక్షన్‌లను మించిపోతుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
 
మరోవైపు అమెరికాలో అజ్ఞాతవాసి హక్కులను పొందిన తెలుగు సంస్థ ఎల్ఏ ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాను విడుదల చేయని రీతిలో ఏకంగా 580 చోట్ల రిలీజ్ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పవన్, త్రివిక్రమ్‌ను అమెరికాకు తీసుకెళ్లి కలెక్షన్లు రాబట్టాలని యోచిస్తోంది. ఇక్కడ ప్రీమియర్ షోలతోనే రెండు మిలియన్ డాలర్లు వసూలు కావచ్చని అంచనా వేస్తున్నారు.
 
ఏదేమైనా బాహుబలి2 రికార్డును బ్రేక్ చేయడమే అజ్ఞాతవాసి లక్ష్యంగా కనిపిస్తోంది... అయితే ఇది ఎంతవరకు సాధ్యపడుతుందో... పవన్ త్రివిక్రమ్‌ల కాంబినేషన్ మ్యాజిక్ మళ్లీ వర్కవుట్ అవుతుందో లేదో... మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments