Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ను దాటి నంది ముందుకెళుతుందా..!

నంది అవార్డుల కమిటీ చురుగ్గా పనిచేస్తోంది. దాదాపు ఐదేళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత అవార్డులు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2012-13 సంవత్సరాలకు గాను నంది అవార్డుల విజేతల్ని నిర్ణయించ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (20:57 IST)
నంది అవార్డుల కమిటీ చురుగ్గా పనిచేస్తోంది. దాదాపు ఐదేళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత అవార్డులు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2012-13 సంవత్సరాలకు గాను నంది అవార్డుల విజేతల్ని నిర్ణయించేందుకు రెండు కమిటీలు వరుసగా సినిమాలు చూస్తున్నాయి. ఎంట్రీలుగా వచ్చిన సినిమాల నుంచి యేడాదికి 42 అవార్డుల చొప్పున ఇచ్చేందుకు వీలుంది. అయితే ఏ అవార్డు ఎవరికి దక్కినా ఉత్తమ హీరో అవార్డు మాత్రం పవన్‌కే రావలంటున్నారు ఫ్యాన్స్.
 
పవన్‌ను దాటి నంది ఎలా ముందుకెళుతుందో చూస్తామంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇంతలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. 2012 సంవత్సరంలో 'గబ్బర్ సింగ్' సినిమా వచ్చింది. ఆ యేడాది బిగ్గెస్ట్ హిట్ అదే. వసూళ్ళ పరంగా, వినోదం పరంగా గబ్బర్ సింగ్‌ను దాటిన మూవీ రాలేదు. ఇక 2013 సంవత్సరంలో అత్తారింటికి దారేది సినిమా వచ్చింది. 
 
ఇది గబ్బర్ సింగ్ కంటే పెద్ద హిట్. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ ఇది క్రాస్ చేసింది. ఇలాంటి రెండు పెద్ద సినిమాల్ని అందించిన పవన్‌ను కాదని, ఉత్తమ హీరో విభాగంలో నంది అవార్డు వేరొకరికి ఇస్తే ఖచ్చితంగా అది వివాదాస్పదమవుతుంది. జూన్‌లో ఏపీ రాజధాని అమరావతిలో నంది అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments