బుక్‌ మై షోపై విరుచుకుపడిన నిర్మాత బన్నీ వాసు

ఠాగూర్
గురువారం, 16 అక్టోబరు 2025 (11:32 IST)
ప్రముఖ ఆన్‌లైన్ సినిమా టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'పై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు విరుచుకుపడ్డారు. సినిమా టిక్కెట్లు విక్రయించే 'బుక్ మై షో' వంటి యాప్‌లు కూడా సినిమాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి వారి వల్ల చిత్రపరిశ్రమకు నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణాలను పరిశీలిస్తే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే జర్నలిస్టులు విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారని అలాంటపుడు ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్‌తో ప్రత్యేకంగా ప్రయోజనం ఏంటని ఆయన నిలదీశారు. టిక్కెట్ కొనుగోలు చేసే సమయంల ఒక సినిమా బాగుంది, బాగాలేదు అని రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 
 
మీరు కూడా సినిమా మీదే ఆదారపడి వ్యాపారం చేస్తున్నారు కదా.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ 'బుక్ మై షో' యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు. ఈ రేటింగ్స్ కారణంగా సినిమా నిర్మాత నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బన్నీవాసు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాశంగా మారాయి. 
 
ఇదిలావుండగా, బన్నీవాసు నిర్మాతగా మిత్రమండలి అనే కొత్త చిత్రాన్ని నిర్మించగా, ఇందుల ప్రియదర్శి, నిహారిక, మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments