Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

డీవీ
శనివారం, 27 ఏప్రియల్ 2024 (13:58 IST)
Bullet team with Shobharani, V Samudra
హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు.  మార్చి 8న  విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ఇంకా థియేటర్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర 50 రోజుల వేడుకను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శోభారాణి, దర్శకులు వి సముద్ర హాజరయ్యారు.
 
శోభారాణి మాట్లాడుతూ.."చిన్న చిత్రాలు రెండు మూడు రోజులు కూడా ఆడని ఈ రోజుల్లో బుల్లెట్ 50 రోజులు పూర్తి చేసుకొని ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవడం మామూలు విషయం కాదు. బుల్లెట్ ఇప్పుడు చిన్న సినిమా కాదు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు చౌడప్ప గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన డైరెక్టర్ గా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్" అని చెప్పారు. 
 
దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ.."బుల్లెట్ చిత్రం 50 రోజుల వేడుక చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. గోపీచంద్ ప్రభాస్ లాగా ఈ చిత్రంలోని హీరో రవివర్మ కూడా చాలా హైట్ ఉన్నాడు. తను కూడా వాళ్ళ లాగా సక్సెస్ అవ్వాలని కోరుతూ అందరికీ ఆల్ ద బెస్ట్" అని అన్నారు. 
 
హీరో రవివర్మ మాట్లాడుతూ.."మా సినిమాని ఇంతలా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నేను నటించిన మొదటి చిత్రమే 50 రోజులు పూర్తి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పారు. 
 
దర్శకుడు చౌడప్ప మాట్లాడుతూ.."మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని చెప్పారు.
 
నిర్మాత గోపాల్ మాట్లాడుతూ.."ఈ సినిమా విజయం పై మొదటి నుంచి నమ్మకంగా ఉన్నాం. అనుకున్నట్టుగా విజయం సాధించడంతో పాటు 50 రోజులు వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు చౌడప్ప పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నా" అని అన్నారు. చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments