Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమా ఫంక్షన్ లు, రివ్యూలపై ఏకిపారేసిన బులెట్ భాస్కర్

Advertiesment
Bullet Bhaskar

డీవీ

, శనివారం, 16 మార్చి 2024 (11:10 IST)
Bullet Bhaskar
సినిమా రంగంలో ఏది జరిగినా అది హైలైట్ అవుతుంది. కానీ ఈమధ్య సినిమా ప్రచారంలో భాగంగా జరుగుతున్న కొన్ని వింతపోకడలను అప్పుడప్పుడు బజర్ దస్త్ ప్రోగ్రామ్ లో నటీనటులు సెటైరిక్ గా చూపిస్తున్నారు. దీనిపై గతంలో కొన్ని విమర్శలు వచ్చినా చేసేవి చేస్తునే వున్నారు. తమను అనవసరంగా ట్రోల్ చేస్తూ వారు రేటింగ్ పెంచుకున్నట్లు వారు తెలియజేశారు కూడా.  కానీ ఈమధ్య సినిమా ఫంక్షన్ లు శ్రుతిమించడంతో తాము అలా చేయాల్సి వచ్చిందని కొందరు తెలియజేస్తున్నారు. వీటిపై  సోషల్ మీడియాలో మీమ్స్, ఇన్ ఫ్లూయన్సర్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
 
Bullet Bhaskar and team
కాగా, నిన్నజరిగిన బులెట్ భాస్కర్ ఎపిసోడ్ లో తను పలు సినిమాలు తీసిన హీరో. ఏదీ పెద్దగా ఆడవు. కొన్నిరిలీజ్ కు నోచుకోవు. ప్రచారంలో భాగంగా ఓ సినిమా ఫంక్షన్ ఏర్పాటుకు బౌన్సర్లను, ఆడియన్స్ ను కూడా డబ్బులిచ్చి తెప్పించడం చూపించారు. ఇక సినిమా రిలీజ్ రోజు థియటర్ బయట కొంతమంది వ్యూవర్స్ తో తన సినిమా గురించి చెప్పమంటే. అద్భుతం, అమోఘం, ఏమి చేశారండి..ఈ ఫైట్ ఎలా చేశారో..  అంటూ హీరోను పొగుడుతూ వుంటారు. భాస్కర్ కు అనుమానం వచ్చి ఇంతకు ఏ సినిమా గురించి మీరు చెబుతున్నారని అడిగితే.. సలార్, హను మాన్ సినిమాల గురించి అని రివ్యూవర్స్ చెబుతారు. దాంతో ఖిన్నుడైన భాస్కర్, తన మేనేజర్ పొట్టి నరేష్ ను ఏర్పాట్లు ఇలా చేశావంటూ.. ఏడుస్తూ  సెటైరిక్ గా అడగడం విశేషం.
 
Bullet Bhaskar, haima and others
ఇక హీరోయిన్లను కూడా వదలేదు. ఫంక్షన్ కు హాజరైన ఓ  హీరోయిన్ హీరో గురించి మాట్లాడుతూ, వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ, కోఠిలో నేను ఓ దుకాణం నడుపుతుండగా ఈయన సినిమా చూసేవాడినంటూ.. భిన్నమైన సెటైరిక్ గా చూపించాడు. ఏది ఏమైనా సినిమా ఫంక్సన్ల పై, రివ్యూలపై, హీరోయిన్లపై ఒకేసారి ఎపిసోడ్ వేయడం విశేషమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్లోబల్ స్పిరిచువల్ కమలేష్దాజీ ఆశీస్సులు పొందిన క్లిన్‌కార కొణిదెల