Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్ద‌రు ద‌ర్శ‌కుల క‌ల‌యిక‌లో బుజ్జి ఇలా రా

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (17:28 IST)
dhanraj, Chandini, Iyengar, G. Nageswara Reddy, Allari Naresh, Garudavega Anji and others
సునీల్, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జి ఇలా రా’. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ అనేది ట్యాగ్‌లైన్‌. చాందినీ అయ్యంగార్‌ హీరోయిన్‌. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి  కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా వ‌ర్క్ చేస్తున్నారు. 
 
రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్పణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై  అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ మెటిరియల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో అల్లరి నరేష్ ముఖ్య అతిధిగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
 
ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. జి.నాగేశ్వర రెడ్డి గారు నాకు ఇష్టమైన దర్శకులు. నా కెరీర్ లో  సీమశాస్త్రి, సీమటపాకాయ్ లాంటి పెద్ద విజయాలు ఇచ్చారు. దర్శకుడిగా కంటే నాకు మంచి స్నేహితులు. అంజి కెమరామెన్ అవ్వకముందే నాకు తెలుసు. వాలిద్దరికోసం ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. దర్శకత్వంపై తనకు ఆసక్తి వుందని అంజి ఎప్పటినుండో చెప్పేవారు. గరుడ వేగలాంటి సినిమాలో అద్భుతమైన కెమరా వర్క్ చేశారు. అంతమంచి టెక్నిషియన్ దర్శకుడు కావడం, నాగేశ్వర రెడ్డి లాంటి దర్శకులు స్క్రిప్ట్ అందించి, దర్శకత్వంలో సహాయంగా వుండటం ఖచ్చితంగా సినిమా బావుంటుందని చెప్పడానికి నిదర్శనం. నాగేశ్వర రెడ్డి ఎక్సయిట్ అయ్యారంటే ఖచ్చితంగా సినిమాలో మ్యాజిక్ వుంటుంది. సాయి కార్తిక్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ట్రైలర్ లో వచ్చిన నేపధ్య సంగీతం చాలా బావుంది. సినిమా థియేటర్లో ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుందని భావిస్తున్నాను. సునీల్ గారు అంటే నాకు చాలా ఇష్టం. తొట్టిగ్యాంగ్ నుండి మా ప్రయాణం కొనసాగుతోంది. ధనరాజ్ నేను చాలా సినిమాలు కలసి చేశాం. ధనరాజ్ కి మంచి సినిమా కుదిరింది. ఈ సినిమాలో అందరూ మంచి టెక్నిషియన్స్, నటీనటులు పని చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది'' అన్నారు.
 
ధనరాజ్ మాట్లాడుతూ.  నాగేశ్వర రెడ్డి గారు నాకు ఒక గురువులా దారి చూపించారు. దర్శకుడు అంజి ఈ సినిమాతో చాలా పెద్ద దర్శకుడు అవుతారు.  నిర్మాతలు నాగిరెడ్డి, సంజీవ రెడ్డి, రూపా జ‌గ‌దీశ్‌ నా కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమాలో నేనే హీరోగా వుండాలని పట్టుపట్టిమరీ సినిమా తీశారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ చేయడం మా అదృష్టం. సినిమా అద్భుతంగా వచ్చిందని ఆయన రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇందులో నాది సీరియస్ రోల్ అని ముందే ప్రేక్షకులకు ప్రిపేర్ చేయమని సలహా ఇచ్చారు. ఈ సినిమాలో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ వుంటాయి. అల్లరి నరేష్ మాకు స్ఫూర్తి. ఒకవైపు కామెడీ ఎంటర్ టైనర్ లు చేస్తూనే మహర్షి నాంది లాంటి సినిమాలు చేస్తున్నారు. ఆయన ఈ వేడుకకి రావడం ఆనందంగా వుంది. సునీల్ ఈ చిత్రానికి మరో బ్యాక్ బోన్. ఆయన వచ్చిన తర్వాత సినిమా స్థాయి మారింది. శ్రీకాంత్ అయ్యంగర్ యాక్టింగ్ మాస్టర్. ఆయన పాత్ర కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ చాందినికి మంచి పేరు వస్తుంది.   మంచి సినిమా తీస్తే జనాలు తప్పకుండా చూస్తారనే నమ్మకంతో తీశారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని మీడియాని కోరుతున్నా.  ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులని థ్రిల్ చేస్తుంది. ఇది పైసా వసూల్ సినిమా'' అన్నారు.
 
దర్శకుడు అంజి మాట్లాడుతూ.. దర్శకత్వ పర్యవేక్షణ అనే మాటకు సరైన అర్ధం చూపేలా నాగేశ్వర రెడ్డి గా ఈ చిత్రం కోసం పని చేశారు. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అంతా ఆయనే. అల్లరి నరేష్ గారు ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా వుంది. సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీ అందరికి సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్ లో ఎంజాయ్ చేయాలి'' అని కోరారు
 
జి.నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ,  కథ అద్భుతంగా రాయగానే సరిపోదు. అది నటీనటులు నటన బట్టే అద్భుతం అవుతుంది. అది ఈ సినిమాకి జరిగింది. ఈ సినిమా విజయం సాధిస్తే మంచి పేరు అంజికి రావాలి. సినిమా ఆడకపోతే మాత్రం చెడ్డ పేరు నాకు రావాలని కోరుకుంటున్నాను. కారణం.. ఈ సినిమా కథ రాసి నిర్మాతలని, అంజిని ఒప్పించింది నేనే. ఒక సినిమా ఫ్లాప్ ఐతే నిర్మాతలు డబ్బులు పోతాయి. దర్శకుడి పేరు పోతుంది. కానీ ఈ సినిమా ఆడకపొతే నా ముగ్గురు స్నేహితులు నాగి రెడ్డి, జగదీశ్, సంజీవ్ రెడ్డి పోతారు. కాబట్టి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి అసలైన హీరోలు నిర్మాతలే అని కోరారు.
 
శ్రీకాంత్ అయ్యర్‌ మాట్లాడుతూ.. చాలా డిఫరెంట్ కథతో ఈ చిత్రాన్ని చేశాం. ధనరాజ్ మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కగా చేశారు. సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నిర్మాతలు చాలా ప్యాషన్ తో సినిమాని నిర్మించారు. వారికి మంచి పేరు, లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా సినిమాని థియేటర్ లో చూడాలి'' అని కోరారు
 
సాయికార్తీక్‌ మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చింది. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసిన చిత్రమిది. నటీనటులందరూ అద్భుతంగా చేశారు. సినిమా గొప్ప విజయం సాధించి నిర్మాతలకు టీం అందరికీ మంచి పేరు రావాలి'' అని కోరారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments