పుష్ప టీజర్ అదుర్స్.. 24 గంటల్లో 25 మిలియన్ వ్యూస్‌.. ఆల్ టైం రికార్డు

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (13:18 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "పుష్ప". రష్మిక మందన్న హీరోయిన్. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 13న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 
 
ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్ డే. ఈ సందర్బంగా ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం 'పుష్ప' టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్‌తో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో దుమ్మురేపుతున్న 'పుష్ప' టీజర్ తాజాగా 900కే వ్యూస్‌తో 30 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా 'పుష్ప' పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. 
 
కాగా టాలీవుడ్ లో 24 గంటల్లో పుష్ప టీజర్ 25 మిలియన్ వ్యూస్‌తో రికార్డులు బ్రేక్ చేయగా, సరిలేరు నీకెవ్వరు టీజర్ 14.64 మిలియన్ వ్యూస్, రామరాజు ఫర్ భీం టీజర్ 14.14 మిలియన్ వ్యూస్, సాహో టీజర్ 12.94 మిలియన్ వ్యూస్, మహర్షి టీజర్ 11.14 మిలియన్ వ్యూస్ సాధించాయి. అయితే వ్యూస్ పరంగా 'కేజిఎఫ్-2' టీజర్ మొదటి స్థానాల్లో ఉండగా... 'పుష్ప' టీజర్ రెండవ స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments