టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (23:05 IST)
టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారు. ఆయన వయసు 53. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయనను కొన్ని రోజుల క్రితం నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకు వెల్లడించారు. వైద్య సేవలు పొందలేని దీనస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. 
 
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముషీరాబాద్‌లో నివాసం ఉంటున్న వెంకట్.. నటుడు శ్రీహరి ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. డైరెక్టర్ వీవీ వినాయక్ ఆయనను నటుడుగా పరిచయం చేశారు. వెంకట్ వందకు పైగా చిత్రాల్లో హాస్య నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఫైటర్‌గా సినీ అభిమానులను ఆలరించారు. ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, డీజే టిల్లు తదితర హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments