కేంద్ర గృహనిర్మాణ - పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ప్రకారం, భారతదేశంలోని 10 లక్షలకు పైగా జనాభా కలిగిన 40 నగరాల్లో హైదరాబాద్ ఆరవ పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఈ నగరం 2023-24లో 9వ స్థానంలో ఉంది.
అంతకుముందు సంవత్సరం 10వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మొదటి రెండు పరిశుభ్రమైన నగరాలు అహ్మదాబాద్, భోపాల్ నిలవగా.. తెలంగాణలో, ఈ సంవత్సరం టాప్ 10 జాబితాలో మరే ఇతర నగరం చోటు దక్కించుకోలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ నుండి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) 9వ ర్యాంక్‌ను దక్కించుకుంది.
అలాగే హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణ స్థానిక సంస్థ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆరవ ర్యాంకును సాధించడంతో పాటు, సెవెన్-స్టార్ సిటీగా రేటింగ్ పొందింది.
వాటర్+ సర్టిఫికేషన్‌ను పొందింది. దీనితో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (SCB) కూడా మంచి పారిశుద్ధ్య పద్ధతులకు అవార్డును అందుకుంది. కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా చెత్త రహిత నగరం (GFC) రేటింగ్ కింద హైదరాబాద్‌కు ఏడు స్టార్స్ లభించాయి.