Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

Advertiesment
lalu prasad yadav

ఠాగూర్

, శుక్రవారం, 18 జులై 2025 (12:36 IST)
ఆర్జేడీ అధినేత, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మళ్లీ కష్టాలు తప్పేలా లేవు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలపై కింది కోర్టు జరుపుతున్న విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు తన పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ లాలూ  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో ట్రయల్ కోర్టు కార్యకలాపాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. 
 
లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే శాఖామంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. మధ్యప్రదేశ్, రాష్ట్రంలోని జబల్పూరులో ఉన్న వెస్ట్ సెంట్రల్ జోన్ ఆఫ్ ఇండియా రైల్వేలో గ్రూపు-డి నియాకాల సమయంలో లాలూ ఈ కుంభకోణానికి తెరతీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆయన భార్య రబ్రీదేవి, ఇద్దరు కుమార్తెలతో సహా మరో అధికారి కూడా ఉన్నారు. 
 
లాలూ ప్రసాద్ యాదవ్ తన పిటిషన్‌ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2022, 2023, 2024లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని, కుంభకోణం జరిగినట్టుగా చెబుతున్న స్కామ్‌పై 14 యేళ్ల తర్వాత కేసు నమోదైందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులోని అని వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదావేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం