Webdunia - Bharat's app for daily news and videos

Install App

2018 చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న తెలుగు ఆడియన్స్

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (16:25 IST)
2018 poster
కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన 2018 చిత్రం నేడు తెలుగులో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ను రాత్రి హైదరాబాద్, వైజాగ్ మరియు విజయవాడలో ఘనంగా స్టార్ట్ చేసారు. 
 
ప్రెస్ స్క్రీనింగ్ మరియు సెలబ్రిటీ ప్రీమియర్ నుండి అనూహ్య స్పందన ఈ సినిమాకి లభించింది. అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. 
 
ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు ఇప్పటికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందనీ, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుందని, రానున్న రోజుల్లో ఈ సినిమా బుకింగ్స్ మరింతగా పెరుగుతాయని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. 
 
2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments