Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీదేవి చీరలు వేలం.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:23 IST)
వెండితెర అతిలోక సుందరి అందాల నటి శ్రీదేవి ఈలోకం విడిచిపోయింది. కానీ, ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా చెదిరిపోలేదు. ముఖ్యంగా, శ్రీదేవి మరణించారన్న వార్తను ఆమె అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమె ధరించిన కోటా చీరను వేలం వేయాలని ఆమె భర్త బోనీకపూర్ నిర్ణయించారు. ఆ వేలం ద్వారా వచ్చిన సొమ్మును ధార్మిక కార్యాలకు వినియోగించాలనేది ఆయన ఆశయం. 
 
ఈ చీరలను ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. వేలం ఆదాయాన్ని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, నిస్సహాయులు, వృద్ధుల కోసం, విద్యాభివృద్ధికి పనిచేసే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. కాగా, అబుదాబీలో సమీపబంధువు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ నక్షత్ర హోటల్‌లో ప్రమాదవశాత్తు స్నానపు నీటి తొట్టిలో పడి చనిపోయిన విషయం తెల్సిందే. ఆమె చితాభస్మాన్ని కుటుంబసభ్యులు తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్రంలో నిమజ్జనం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15ఏళ్లలో నలుగురిని పెళ్లాడిన మహిళ.. పేర్లు మార్చుకుని పెళ్లయ్యాక జంప్!

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

Pawan Kalyan: నారా దేవాన్ష్‌ను అభినందించిన పవన్ కల్యాణ్ - ఎందుకో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments