Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డని క్రాక్ గాడుగా ఎందుకుంటాడ‌నేదే చెప్పబోతున్న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

డీవీ
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (14:56 IST)
Jack team at nepal
టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ క‌థాయ‌కుడిగా  బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ ట్యాగ్ లైన్. విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేయ‌టానికి ఇష్ట‌ప‌డే సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబోలో మ‌రో కొత్త జోన‌ర్ మూవీగా జాక్ తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే చిత్రంగా ఇది రూపొందుతోంది. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నేపాల్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌కాష్ రాజ్‌, వైష్ణ‌వి చైత‌న్య త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమా 80 శాతం పైగానే చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.  అచ్చు రాజ‌మ‌ణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. స‌రికొత్త జోన‌ర్‌, ఫ్రెష్ కామెడీ, వావ్ అనిపించే సౌండ్ ట్రాక్‌ను అచ్చు రాజ‌మ‌ణి సిద్ధం చేస్తున్నారు. సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. త‌నే క్రాక్ గాడు ఎందుకుంటాడ‌నేదే తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. లాఫింగ్ రైడ్‌లా సినిమా ఉంటుంది. బేబి సినిమా ఫేమ్ వైష్ణ‌వి చైత‌న్య ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments