Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత వేశ్య అయితే మాత్రం ఇంత పచ్చిగానా...?

సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య వేశ్యలపైన చిత్రాలు తీయడం ఎక్కువైంది. వేశ్య పాత్రలో నటించాలని చెబితే... ఎవరయినా కాస్త ఆలోచిస్తారేమోగానీ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ విద్యా బాలన్ మాత్రం వెనకా ముందూ ఆలోచించకుండా ఓకే చెప్పేస్తుంది. తాజాగా ఆమె నటిస్తున్న బాలీవుడ్ చిత్

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (14:37 IST)
సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య వేశ్యలపైన చిత్రాలు తీయడం ఎక్కువైంది. వేశ్య పాత్రలో నటించాలని చెబితే... ఎవరయినా కాస్త ఆలోచిస్తారేమోగానీ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ విద్యా బాలన్ మాత్రం వెనకా ముందూ ఆలోచించకుండా ఓకే చెప్పేస్తుంది. తాజాగా ఆమె నటిస్తున్న బాలీవుడ్ చిత్రం బేగం జాన్. ఈ చిత్రంలో వేశ్య ఎలా వుంటుందో అలాగే కళ్లకు కట్టినట్లు నటించిందట విద్య. అంతేకాదు... వేశ్యలు ఎలా పచ్చిగా మాట్లాడుతారో అలాంటి సంభాషణలు వున్నాయట. వేశ్యా గృహాల్లో విటుడికీ, వేశ్యకీ జరిగే సెక్సీ సంభాషణ ఎలా వుంటుందో అచ్చం అలాగే విద్యా బాలన్ ఈ చిత్రంలో మాట్లాడుతుందట. 
 
విద్యాబాలన్ వేశ్య పాత్రలో చెప్పిన ఆ మాటలు విని సెన్సార్ బోర్డు సభ్యుల చెవులు చిల్లులు పడిపోయాయట. షాక్ తిన్నారట. ఏంటిది... ఇది అడల్ట్ చిత్రానికి మించి పోయిందంటూ వ్యాఖ్యానించారట. ఎలాంటి సందేహం లేకుండా చిత్రంలో 12 చోట్ల కత్తెరలు వేసారట. నిజానికి ఆ సీన్లే సినిమాకు చాలా కీలకమయినవని దర్శకుడు లబోదిబో మంటున్నారట. ఐతే సెన్సార్ బోర్డు మాత్రం తాము కత్తిరించిన సీన్లలో ఎలాంటి తేడా లేదనీ, ఎట్టి పరిస్థితుల్లో వాటిని తిరిగి సినిమాలో చేర్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారట. 
 
ఈ చిత్రంలో ఆ డైలాగులు, సీన్లు తీసేశారనేసరికి విద్యా బాలన్ కూడా కాస్త అసంతృప్తికి లోనయ్యిందట. అంతేకాదు... ఆమె కొన్నిచోట్ల చెప్పే డైలాగులకు మ్యూట్ చెయ్యాలని కూడా సెన్సార్ బోర్డు సూచన చేసిందట. మరీ ఇంత ఘాటుగా నిర్ణయం తీసుకుంటే ఇక తాము సినిమాలను ఎలా తీయాలని దర్శకుడు గొణుక్కుంటున్నారట. మొత్తమ్మీద బేగం జాన్ చిత్రంతో విద్యా బాలన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వెయిట్ అండ్ సీ.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం