Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో అమీ జాక్సన్.. ఓపీఎస్ వర్గం పక్కా ప్లాన్.. దినకరన్ కూడా?

అమీ జాక్సన్... శంకర్ సినిమాల హీరోయిన్‌గా మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2.0 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిప

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (14:04 IST)
అమీ జాక్సన్... శంకర్ సినిమాల హీరోయిన్‌గా మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2.0 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోతోందని.. ప్రస్తుతానికి సూపర్ స్టార్‌తో నటిస్తున్నందున.. ఆమెను ఎన్నికల ప్రచారంలోకి దించాలని పన్నీర్ సెల్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
 
సినిమా తారలు రాజకీయాల్లో రావడం మామూలే. ఈ కోవలోనే ఎన్టీఆర్, చిరంజీవి, జయలలిత ఎంజీఆర్ వంటి ఎంతో తారలు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తాజాగా హాట్ గ్లామర్ తార అమీ జాక్సన్.. తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అన్నాడీఎంకే నుంచి వర్గంగా చీలిపోయిన ఓపీఎస్ అండ్ టీమ్ ఈమెను రంగంలోకి దించేందుకు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. 
 
తమ పార్టీకి క్రేజ్ లభించేందుకు ఓపీఎస్ అమీ జాక్సన్‌ను వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్కేనగర్ ఎన్నికల ప్రచారంలో అమీ జాక్సన్ పాలుపంచుకునేలా సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిసింది. తద్వారా తన కూటమిని గెలిపించుకోవాలని ఓపీఎస్ భావిస్తున్నారు. 
 
అయితే ఇంతలోనే దినకరన్ అమీ జాక్సన్ తన వర్గానికి సపోర్ట్ చేయాలని ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకు అమీ జాక్సన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. మరి అమీ జాక్సన్ దినకరన్‌కు సపోర్ట్ చేస్తుందా? ఓపీఎస్‌కు మద్దతిస్తుందా అనేది తెలియాల్సి వుంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments