డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మన్ కోహ్లీ అరెస్టు

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (13:46 IST)
బాలీవుడ్ చిత్రసీమను డ్రగ్స్ కేసు వెంటాడుతూనేవుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. తాజాగా బాలీవుడ్ నటుడు అర్మాన కోహ్లీని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) అరెస్టు చేసింది. 
 
డ్రగ్స్ సప్లయర్ అజయ్ రాజు సింగ్‌తో కలిసి అర్మాన కోహ్లీ పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతనివద్ద పలు కోణాల్లో విచారించిన తర్వాత అరెస్టు చేశారు. ముఖ్యంగా, ఈ విచారణలో లభించిన ప్రాథమిక ఆధారాలతో అర్మాన్‌ కోహ్లీ ఇంటిలో కూడా ఎన్.సి.బి. అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అర్మాన్ ఇంట్లో కొకైన్ లభ్య‌మైంది.
 
దీంతో అర్మాన్‌ కోహ్లీని కూడా ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఆదివారం ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి జైలుకు తరలించారు. 
 
కాగా, సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' సినిమాలో అర్మాన్ న‌టించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే,  హిందీ "బిగ్‌ బాస్‌"లోనూ అర్మాన్‌ కోహ్లీ పాల్గొన్నాడు. ఆయ‌న‌కు దక్షిణ అమెరికా దేశాల నుంచి డ్ర‌గ్స్ అందిన‌ట్లు అధికారులు తేల్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనకాపల్లిలో ఆరునెలల బిడ్డతో మహిళ అనుమానాస్పద మృతి.. వరకట్నం వేధింపులే..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

హైదరాబాద్: గూగుల్ రోడ్డు, మెటా రోడ్డు, టీసీఎస్ రోడ్డు అని పేరు పెట్టాలి.. రేవంత్ రెడ్డి

Bihar Elections: పత్తా లేకుండా పోయిన ప్రశాంత్ కిషోర్

Hyderabad Police: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. భద్రతా ఏర్పాట్లు ముమ్మరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments