కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను చెంప దెబ్బ కొట్టేవాడినని చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు... మంగళవారం అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే కేంద్రమంత్రి ఉన్న సంగమేశ్వర్‌కు వెళ్లిన పోలీసుల బృందం.. అరెస్ట్ ప్రక్రియను కొనసాగిస్తోంది. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం రత్నగిరి కోర్టు, బాంబే హైకోర్టులకు వెళ్లిన నారాయణ్ రాణెకు రెండు చోట్లా చుక్కెదురైంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలన్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.
దేశానికి ఏ ఏడాది స్వాతంత్ర్యం వచ్చిందో తెలియని ఉద్ధవ్ థాక్రేను తాను చెంప దెబ్బ కొట్టేవాడినని సోమవారం ఓ ర్యాలీలో అన్నారు కేంద్ర మంత్రి నారాయణ్ రాణె. దీనిపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై ఫిర్యాదులు చేసింది. బీజేపీ కార్యాలయాలపై శివసేన కార్యకర్తలు దాడులు కూడా చేశారు.