Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబీ సింహా ట్రైలింగ్వ‌ల్ మూవీ వ‌సంత కోకిల

Bobby simha
Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (18:43 IST)
ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా హీరోగా రూపొందిస్తోన్న‌ ట్రైలింగ్వ‌ల్ మూవీ వ‌సంత కోకిల‌. ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా @న‌ర్త‌న‌శాల ఫేమ్ కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లై అంతటా విశేషాద‌ర‌ణ అందుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమా మోష‌న్ పోస్టర్ ను రేజ్ ఆఫ్ రుద్ర పేరిటి విడుద‌ల చేశారు. సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి రేజ్ ఆఫ్ రుద్ర మోష‌న్ పోస్టర్ అనూహ్య స్పంద‌న ల‌భించిండం విశేషం. 

థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్స్, బాబీ సింహా మ్యాన్లీ లుక్ వెర‌సి రైజ్ ఆఫ్ రుద్ర మోష‌న్ పోస్ట‌ర్ ని నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లాయి. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా ఈ మోష‌న్ పోస్ట‌ర్ కు వీడియో గ్లిమ్స్ కూడా జోడించి సిద్ధం చేశారు.

రొమాంటిక్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది. సినిమా జాన‌ర్ కి, బాబీ సింహా అత్యుత్త‌మ ప‌ర్ఫార్మెన్స్ కి త‌గిన విధంగానే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ వ‌సంత కోకిలను తెర‌కెక్కించార‌ని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. జాతియ అవార్డు గ్ర‌హిత‌, విల‌క్ష‌ణ హీరో క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్ లో వ‌చ్చిన వ‌సంత కోకిల ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెర‌కెక్కుతున్న సినిమాలో మ‌రో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా న‌టించ‌డం విశేషం. థింక్ మ్యూజిక్ వారు ఈ సినిమా ఆడియో రైట్స్ ద‌క్కించుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments