ఆత్మహత్యలకు పాల్పడుతున్న నటీమణుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా కన్నడ నటి జయశ్రీ బెంగళూరులో ఆమె నివాసంలో విగతజీవురాలిగా కనిపించారు. ఆమె మృతదేహం సీలింగ్ కు వేళ్లాడుతున్న స్థితిలో గుర్తించారు. జయశ్రీ మగది రోడ్ లోని ప్రగతి లే అవుట్ లో నివసిస్తున్నారు. జయశ్రీ కన్నడ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆమె గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలోనూ పాల్గొన్నారు. కాగా, జయశ్రీ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నటి మరణంతో కన్నడ చిత్రపరిశ్రమలో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఆమె మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
జయశ్రీ గతకొంతకాలంగా మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నారు. కొన్నాళ్ల కిందట ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపింది. ఈ దరిద్రగొట్టు ప్రపంచం నుంచి, మానసిక దౌర్బల్యం నుంచి వెళ్లిపోతున్నాను అని ఆ పోస్టులో వెల్లడించింది. దాంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. అయితే జయశ్రీ వెంటనే ఆ పోస్టును తొలగించింది.