Webdunia - Bharat's app for daily news and videos

Install App

టబుకు చేదు అనుభవం.. ఓ అభిమాని అసభ్యంగా ప్రవర్తించాడు..

1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసుపై గురువారం తీర్పు వెలువడనుంది. ఈ ఘటనలో సల్మాన్‌తో పాటు వున్న సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబులు

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (10:50 IST)
1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసుపై గురువారం తీర్పు వెలువడనుంది. ఈ ఘటనలో సల్మాన్‌తో పాటు వున్న సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబులు కూడా నిందితులుగా కేసును ఎదుర్కొన్నారు. ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించనున్న క్రమంలో కోర్టుకు హాజరయ్యేందుకు టబు జోధ్‌పూర్‌ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
 
ఈ సందర్భంగా టబుకు చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని మరీ ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే అక్కడ ఉన్న బౌన్సర్లు అతన్ని పక్కకు లాగిపడేశారు. దీంతో టబు చాలా ఇబ్బంది పడ్డారని, దీనిపై కేసుపెట్టే అవకాశం ఉందని మీడియా వెల్లడించింది. 
 
ఇదిలా ఉంటే.. కృష్ణ జింకను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భవితవ్యం ఏంటో గురువారం తేలిపోనుంది. ఈ కేసులో సల్మాన్ దోషిగా తేలితే... ఒక ఏడాది నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జోధ్ పూర్ జైలు అధికారులు సల్మాన్ కోసం అప్పుడే ఓ గదిని శుభ్రం చేసి సిద్ధంగా వుంచారట. 
 
ఈ సందర్భంగా జోధ్ పూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ, సెంట్రల్ జైల్లో సల్మాన్ కోసం ఓ గదిని శుభ్రం చేసి ఉంచామని చెప్పారు. కానీ, గదిలో ఏసీ, కూలర్, ఫ్యాన్ లాంటి ప్రత్యేక సదుపాయాలేమీ లేవని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments