Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో పడిన వర్మ హీరోయిన్ ... పలు సెక్షన్ల కింద కేసులు...

Webdunia
ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (16:40 IST)
'రంగీలా' చిత్రంతో ఓ ఊపు ఊపిన హీరోయిన్ ఊర్మిళ. ఈ ఒక్క చిత్రంతో ఈమె వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవలే ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. 
 
అయితే, ఆమె హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సురేష్ నఖువా తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను టీవీలో ఊర్మిళ ప్రసంగం వింటూ ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల దిగ్భ్రాంతికి గురయ్యానని సురేష్ అందులో పేర్కొన్నారు. 
 
హిందుత్వం ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమతం అంటూ ఊర్మిళ అనడం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను కించపర్చడమేనని సురేష్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు హిందువులను ఉగ్రవాదులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ సెక్షన్ 295ఏ, సెక్షన్ 505, సెక్షన్ 34 కింద ఊర్మిళపై కేసు నమోదైంది.
 
అంతేకాదు, కాంగ్రెస్ అధితనే రాహుల్ గాంధీపైనా, ఊర్మిళ వ్యాఖ్యలను ఖండించకుండా అనుమతించిన టీవీ చానల్ యాంకర్ పైనా సురేష్ నఖువా ఫిర్యాదు చేశారు. హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసేలా కాంగ్రెస్ నేతలను రాహుల్ ప్రోత్సహిస్తున్నారని, ఊర్మిళ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం చెప్పకపోవడం ద్వారా టీవీ చానల్ యాంకర్ సమ్మతి తెలిపినట్టయిందని సురేష్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments