Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్ల‌ల్ని క‌నెయ్యాలా'? ప్రశ్నిస్తున్న నటి

వివాదాస్పద బాలీవుడ్ నటీమణుల్లో బిపాసా బసు ఒకరు. ఈ హాట్ యాంకర్ చేసే ప్రతిపనీ, చేసే ప్రతి వ్యాఖ్యా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు మరోమారు చర్చకు దారితీశాయి. 'పెళ్లి చేసు

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (11:29 IST)
వివాదాస్పద బాలీవుడ్ నటీమణుల్లో బిపాసా బసు ఒకరు. ఈ హాట్ యాంకర్ చేసే ప్రతిపనీ, చేసే ప్రతి వ్యాఖ్యా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు మరోమారు చర్చకు దారితీశాయి. 'పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్ల‌ల్ని క‌నెయ్యాలా'? అంటూ ప్రశ్నించింది. 
 
నిజానికి బిపాసా బ‌సు, క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌ను పెళ్లాడి వ‌చ్చే నెల‌తో రెండేళ్లు పూర్తికానున్నాయి. ఈ రెండేళ్లుగా బిపాసా వైవాహిక జీవితాన్ని ఎంత‌గా ఆస్వాదించిందో సోష‌ల్ మీడియా ద్వారా చెబుతూనే ఉంది. భ‌ర్త‌తో వెకేష‌న్‌కు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిన‌పుడు తీసుకున్న ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తూ త‌న సంతోషాన్ని పంచుకుంటుంటుంది.
 
గత యేడాది ఓ ఆస్పత్రి వద్ద ఆమె కనిపించడంతో ఆమె గర్భందాల్చిందనే వార్త చక్కర్లు కొట్టింది. ఇపుడు ఓ ఈవెంట్‌కు హాజ‌రైన బిపాసాను ఓ విలేకరి అడిగిన ప్రశ్నతో ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇది చాలా హాస్యాస్ప‌దంగా ఉంది. తల్లి కావ‌డం త‌ప్ప ఓ మ‌హిళ‌కు త‌న జీవితంలో ఇంకేమి ఉండ‌దా? ఓ మ‌హిళా నిజంగా ఇది విచారించ‌వ‌ల‌సిన విష‌యం. త‌ల్లి కావ‌డం ఏ మ‌హిళ‌కైనా గొప్ప అనుభూతే. అయితే ఓ మ‌హిళ జీవితంలో ఇంకా చాలా ఉంటాయి. కేవ‌లం పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్ల‌ల్ని క‌నెయ్యాలా' అంటూ బిపాసా ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments