దుస్తులను బట్టి గౌరవమా..? అలాంటి గౌరవం నాకొద్దు: బిందుమాధవి

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (19:03 IST)
బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా మహిళా విజేతగా పేరు సంపాదించారు. ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన బిందుమాధవికి విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు. ఇక బిగ్ బాస్ అనంతరం ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. 
 
అయితే తాజాగా ఒక నెటిజన్ నుంచి బిందు మాధవికి చేదు అనుభవం ఎదురైంది.ఈ సందర్భంగా సదరు నెటిజన్ స్పందిస్తూ బిగ్ బాస్ కార్యక్రమంలో బిందు మాధవి ఉన్నప్పుడు తనపై చాలా గౌరవం ఉండేదని కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర కంటెస్టెంట్లు అందరూ బాడీ ఎక్స్‌పోజ్ చేస్తూ ఉన్నప్పటికీ బిందు మాధవి మాత్రం ఎంతో చక్కగా, పద్ధతిగా దుస్తులు ధరించడంతో తనపై చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు తనపై ఉన్న ఆ గౌరవం పోయింది అంటూ నెటిజన్ కామెంట్ చేశారు.
 
ఇక ఇది చూసిన బిందు మాధవి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం తను వేసుకునే దుస్తులు బట్టి ఉంటుందంటే అలాంటి గౌరవం నాకొద్దు అంటూ బిందు మాధవి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
అలాగే ఇది చూసిన నెటిజన్లు బిందు మాధవికి మద్దతు తెలుపుతూ వస్త్రధారణ బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం అంచనా వేయకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

Harish Rao: ఆంధ్రాలో స్విచ్ వేస్తే, తెలంగాణలో బల్బ్ వెలుగుతుంది.. హరీష్ రావు

రోడ్డుకు అడ్డంగా బైకులు పార్క్ చేశారు.. తీయమన్నందుకు డ్రైవర్ గొంతు కోశారు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య... కత్తులతో నరికివేశారు....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments