ఎంతో మందితోపాటు తనకూ స్పూర్తిదాయకుడు, గొప్ప దార్శనికులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలవడం చాలా ఆనందంగా వుందని మహేష్‌బాబు పేర్కొన్నారు. నమత్ర, ఆయన కలిసి బిల్ గేట్స్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసి అభిమానుల్ని ఫిదా చేశారు. ప్రతిసారీ విదేశాలకు ఫ్యామిలీ వెళ్ళే మహేష్‌బాబు “సర్కారు వారి పాట” విడుదల తర్వాత తన ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగా బిల్ గేట్స్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ, బిల్ గేట్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు.ఇంకా అత్యంత వినయస్థుడు! నిజంగా ఒక స్ఫూర్తి అంటూ అన్నారు. ఇప్పుడు మహేష్‌బాబు త్రివిక్రమ్‌తోపాటు, రాజమౌళి సినిమాలకు పనిచేయడానికి సిద్ధమయ్యాడు. వివరాలు త్వరలో తెలియనున్నాయి.