రాహుల్‌తో ప్రేమాయణంపై పున్ను... జనాలు ఎలా తీసుకుంటే అలా? (video)

Webdunia
శనివారం, 16 నవంబరు 2019 (13:41 IST)
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు పునర్నవి భూపాలంపై రూమర్స్ వచ్చిన సంగతి తెలసిందే. బిగ్ బాస్ పుణ్యామా అని రాహుల్, పునర్నవిలు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. బిగ్ బాస్‌ కంటే ముందు ఒకటి రెండు సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు.
 
బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక హౌస్‌లో వీరద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై పునర్నవి భూపాలం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
 
బిగ్ బాస్‌లో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం, వితిక, వరుణ్ సందేశ్ గ్రూప్ యాంకర్ రవికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా తమపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది పునర్నవి. రాహుల్ ఏంటో నాకు బాగా తెలుసని.. అతడిపై ఎంతో గౌరవం ఉందని తెలిపింది. ఎంత తిట్టినా, ఎంత కొట్టినా జీవితంలో అతడు గెలవాలని కోరుకున్నట్లు చెప్పింది పునర్నవి. హౌస్‌లో ఒకొరికొకరు కలిసిమెలసి ఉన్నామని.. రాహుల్‌కు ఎంతో హెల్ప్ చేశానని చెప్పింది.
 
ఓ ఫ్రెండ్‌గా మనస్ఫూర్తిగా సాయం చేశానని, అంతే తప్ప ఏదో ఆశించి హౌస్‌మేట్స్‌కు సాయం చేయలేదని పున్ను చెప్పుకొచ్చింది. రాహుల్‌తో కూడా ఫ్రెండ్‌గానే మెలిగానని.. జనాలు ఎలా తీసుకుంటారో వాళ్లిష్టమని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అత్యంత విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోగ్యం...

వైకాపా లీగల్ సెల్ న్యాయవాది బాగోతం.. మహిళలతో అసభ్య నృత్యాలు..

ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? పీటీఐ నేత ఏమంటున్నారు...

జోరు వర్షంలోనూ తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శన సమయం 15 గంటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments